Quthbullapur: మల్లారెడ్డి యూనివర్సిటీలో ఘనంగా బతుకమ్మ, దాండియా వేడుకలు!

Quthbullapur: కుత్బుల్లాపూర్ మల్లారెడ్డి యూనివర్సిటీలో అక్టోబర్ 14న 10 వేల మంది విద్యార్థినులతో భారీ బతుకమ్మ, దాండియా వేడుకలు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR
Published on: 8 Oct 2026 4:31 PM IST
Quthbullapur
X

Quthbullapur: మల్లారెడ్డి యూనివర్సిటీలో ఘనంగా బతుకమ్మ, దాండియా వేడుకలు!

Quthbullapur: మల్లారెడ్డి యూనివర్సిటీస్ క్యాంపస్‌లో అక్టోబర్ 14న గ్రాండ్‌గా బతుకమ్మ, దాండియా, గర్బా వేడుకలు. మీడియా సమావేశంలో బతుకమ్మ సంబరాల పోస్టర్‌ను ఆవిష్కరించిన డాక్టర్ ప్రీతిరెడ్డి. 10 వేల మందికి పైగా విద్యార్థినులతో అక్టోబర్ 14న భారీ ఎత్తున బతుకమ్మ సంబరాల నిర్వహణ. క్యాంపస్ వేదికగా 65 అడుగుల భారీ బతుకమ్మను ఏర్పాటు చేయనున్న యాజమాన్యం.

బతుకమ్మ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకానున్న సినీ నటి శ్రీలీల. అక్టోబర్ 14న సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభం కానున్న వేడుకలు. విద్యార్థినులకు తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను తెలియజేసేలా ఈవెంట్ నిర్వహణ. మల్లారెడ్డి యూనివర్సిటీ యాజమాన్యం ఆధ్వర్యంలో వేగంగా వేడుకల ఏర్పాట్లు. తెలంగాణ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చేలా భారీ స్థాయిలో బతుకమ్మ సంబరాలు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

BOMMA SRIDHAR, QUTHBULLAPUR