Hyderabad: మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై మల్కాజిగిరి పోలీసుల దాడులు!
Hyderabad: మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు ఐడీఏ నాచారంలో రూ.30 లక్షల విలువైన 60.380 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన ముగ్గురిని అరెస్టు చేశారు.
Hyderabad: మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై మల్కాజిగిరి పోలీసుల దాడులు!
హైదరాబాద్: అంతర్రాష్ట్ర మాదకద్రవ్యాల అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురిని అరెస్టు చేసిన మల్కాజ్గిరి ఎస్ఓటి పోలీసులు. 30 లక్షల విలువైన 60.380 కిలోల గంజాయి స్వాధీనం. ఐడిఎ నాచారంలోని స్టెర్లింగ్ షూస్ కంపెనీ సమీపంలో పట్టివేత. కార్ లో ఒడిశా నుండి హైదరాబాద్‌కు గంజాయిని తరలింపు. ఒడిశా, హైదరాబాద్ మరియు ముంబైల మధ్య ఒక అంతర్రాష్ట్ర మాదకద్రవ్యాల నెట్‌వర్క్ పనిచేస్తున్నట్లు గుర్తింపు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసిన పోలీసులు.




