Malkajgiri: మల్కాజిగిరిలో ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన మంజూరు!

Malkajgiri: మల్కాజిగిరిలో ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన కింద రూ.లక్ష ఆర్థిక సహాయం మంజూరు. లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన కాంగ్రెస్ నాయకులు.

Bodike Manohar, Malkajgiri
Published on: 9 Oct 2026 1:58 PM IST
Malkajgiri
X

Malkajgiri: మల్కాజిగిరిలో ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన మంజూరు!

Malkajgiri: తెలంగాణ రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన పథకం కింద మల్కాజిగిరికి చెందిన ఫాతిమా, ఇక్రమునిస బేగంలకు రూ.50 వేల చొప్పున మొత్తం రూ.లక్ష ఆర్థిక సహాయం మంజూరైంది. కుట్టుపని, బోటిక్‌ వ్యాపారాల ద్వారా స్వయం ఉపాధి పొందేందుకు ప్రభుత్వం 100 శాతం రాయితీపై ఈ ఆర్థిక సహాయాన్ని అందించింది.

మల్కాజిగిరి కాంగ్రెస్ పార్టీ బి-బ్లాక్ అధ్యక్షులు వెంకటేష్ యాదవ్, డివిజన్ అధ్యక్షుడు సంపత్ ఆధ్వర్యంలో మల్కాజిగిరి 183 డివిజన్ లబ్ధిదారులకు ఆర్థిక సహాయానికి సంబంధించిన మంజూరు పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సహకారంతో అర్హులైన లబ్ధిదారుల ఎంపికకు కృషి చేయడంతో పాటు, వారికి ప్రభుత్వ పథకాల ద్వారా ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మహిళలు ఆర్థికంగా ఎదిగి స్వయం ఉపాధితో తమ కుటుంబాలకు అండగా నిలవాలనే లక్ష్యంతో ఈ పథకం దోహదపడుతుందని పేర్కొన్నారు.

మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి జి.కాంతమ్మ ఈ నెల 8న ఆర్థిక సహాయానికి సంబంధించిన మంజూరు ఉత్తర్వులు జారీ చేశారు. మంజూరైన మొత్తాన్ని నిర్దేశించిన స్వయం ఉపాధి కార్యకలాపాలకే వినియోగించాలని, వ్యాపారం ప్రారంభించిన అనంతరం వినియోగ ధ్రువీకరణ పత్రాన్ని సంబంధిత అధికారులకు సమర్పించాలని ఉత్తర్వుల్లో చెప్పారు.

ఈ కార్యక్రమంలో గౌస్, ఆసిఫ్, కొండగౌడ్, సుధాకర్, మహేందర్ గౌడ్, గణేష్, నగేష్ గౌడ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జీడి చరణ్‌జిత్ గౌడ్, సంజయ్, పార్థసారధి, నరేష్ సచారి, రాజు, అమర్ తదితరులు పాల్గొన్నారు.

Bodike Manohar, Malkajgiri

Bodike Manohar, Malkajgiri