Secunderabad: 23 గ్రాముల MDMA స్వాధీనం, రాజస్థాన్ ముఠా అరెస్ట్!
Secunderabad: సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో డ్రగ్స్ అమ్ముతున్న రాజస్థాన్‌కు చెందిన ముఠాను అరెస్ట్ చేసిన మల్కాజిగిరి పోలీసులు. 23 గ్రాముల MDMA స్వాధీనం.
Secunderabad: 23 గ్రాముల MDMA స్వాధీనం, రాజస్థాన్ ముఠా అరెస్ట్!
Secunderabad: ఈజీ మనీ కు అలవాటు పడి డ్రగ్స్ అమ్ముతున్న రాజస్థాన్ కు చెందిన ముఠాను మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్ చేశారు.. విక్రయిస్తున్న వ్యక్తి మహావీర్ సింగ్ తో పాటు వినియోగదారుడు లక్ష్మబ్ సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. రాజస్థాన్ నుండి సరఫరా చేస్తున్న కుల్దీప్ పరారీ లో ఉన్నారని పోలీసులు తెలిపారు.
నిందితుల వద్ద 23 గ్రాముల MDMA డ్రగ్స్ తో పాటు మొబైల్ ఫోన్స్, క్యాష్ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ అమ్మినా, వినియోగించిన చట్టపరమైన చర్యలు ఉంటాయని మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్ తెలిపారు. డ్రగ్స్ కు సంబంధించిన సమాచారం తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని మల్కాజిగిరి డీసీపీ తెలిపారు.




