Malkajgiri: ఇందిరాగాంధీకి మైనంపల్లి ఘన నివాళులు

Malkajgiri: మల్కాజిగిరి చౌరస్తాలో ఇందిరాగాంధీ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పూలమాల వేసి నివాళులర్పించి, ఆమె సేవలను కొనియాడారు.

Bodike Manohar, Malkajgiri
Published on: 19 Nov 2026 5:55 PM IST
Malkajgiri
X

Malkajgiri: ఇందిరాగాంధీకి మైనంపల్లి ఘన నివాళులు

మల్కాజిగిరి: మాజీ ప్రధాని, భారతరత్న ఇందిరాగాంధీ జయంతి వేడుకలను మల్కాజిగిరిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మల్కాజిగిరి చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పాల్గొని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె దేశానికి అందించిన సేవలను స్మరించుకున్నారు.

అనంతరం మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ.. దేశ ప్రధానిగా ఇందిరాగాంధీ అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడటంతో పాటు పేదలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆమె చేసిన కృషి మరువలేనిదని పేర్కొన్నారు. దేశ అభివృద్ధి కోసం ఆమె తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు నేటికీ ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. ఇందిరాగాంధీ ఆశయాలు, ప్రజాసేవా స్ఫూర్తిని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి లక్ష్మీకాంత్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు ప్రేమ్ కుమార్, రాజ్ జితేంద్రనాథ్, ఏకే మురుగేష్, బి బ్లాక్ అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్, నాయకులు బీకే శ్రీనివాస్, జీఎన్‌వీ సతీష్ కుమార్, ఉపేందర్ రెడ్డి, పిట్టల శ్రీనివాస్, సంతోష్ రాందాస్, డివిజన్ అధ్యక్షులు జీడి సంపత్ గౌడ్, వినోద్ యాదవ్, వైనాల ప్రవీణ్, పిట్టల నాగరాజు, మంద భాస్కర్, రొట్టెల ధరణ్ కుమార్, యూసుఫ్, రాఘవన్, లక్ష్మి, కపిలేశ్వర్, రామచందర్, జీడి చరణ్ జిత్ గౌడ్, ఆశా, సుమలత, ఇందిరా ప్రియదర్శిని, శారద, సుమలత యాదవ్, జీవన్ రెడ్డి, చెన్నారెడ్డి, బాలరాజు యాదవ్, పార్థసారథి, బుజ్జన్న, బాబు, సత్యనారాయణ, శ్రీరాములు యాదవ్, వెంకన్న, ఇస్తారి, కుట్టి శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Bodike Manohar, Malkajgiri

Bodike Manohar, Malkajgiri