Malkajgiri: మల్కాజిగిరి ఎమ్మార్పీఎస్, ఎంఎస్‌పీ నూతన కమిటీల నియామకం
Malkajgiri: మల్కాజిగిరి తాళ్లబస్తీ కమ్యూనిటీ హాల్‌లో ఎమ్మార్పీఎస్, ఎంఎస్‌పీ నూతన మండల కార్యవర్గాలను జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులు అధికారికంగా ప్రకటించారు.
Malkajgiri: మల్కాజిగిరి ఎమ్మార్పీఎస్, ఎంఎస్‌పీ నూతన కమిటీల నియామకం
మల్కాజిగిరి: మల్కాజిగిరి ఎమ్మార్పీఎస్, ఎంఎస్‌పీ నూతన కమిటీల నియామక సమావేశం ఆదివారం ఈస్ట్ ఆనంద్‌బాగ్ డివిజన్ పరిధిలోని తాళ్లబస్తీ కమ్యూనిటీ హాల్‌లో జరిగింది. సమావేశానికి ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకుడు కేశపాక రామచందర్ మాదిగ, ఎంఎస్‌పీ రాష్ట్ర నాయకుడు మనోహర్, జిల్లా నాయకుడు ప్రణయ్ మాదిగ, మల్కాజిగిరి మండల ఇన్‌చార్జి బచ్చలకూర స్వామి మాదిగ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ మల్కాజిగిరి మండల అధ్యక్షుడిగా భోగారం పవన్ కళ్యాణ్, కార్యదర్శిగా నక్క సురేష్, డి. సురేష్ నిఖిల్ తదితరులను కమిటీ సభ్యులుగా నియమించారు. ఎంఎస్‌పీ మండల అధ్యక్షుడిగా యు. రామచందర్ మాదిగ, అధికార ప్రతినిధిగా చందర్‌ను నియమించారు.
నూతన కమిటీలతో సంఘాన్ని మరింత పటిష్టం చేసి, రాష్ట్ర, జాతీయ కమిటీల ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాలను ముందుకు తీసుకెళ్తామని నాయకులు తెలిపారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రజా ఉద్యమాలను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 7, 8 తేదీల్లో అమరావతిలో జరిగే సదస్సులను విజయవంతం చేసేందుకు మండల, జిల్లా, రాష్ట్ర కమిటీల నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని కోరారు.
కార్యక్రమంలో సంధిగారి నర్సింగరావు మాదిగ, తులసి సురేష్, జి. కృష్ణ, బి. కృష్ణ, బలరాం, డప్పు సాయి, రాజేష్, మైసయ్య, శ్రీహరి, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.




