Malkajgiri: ఆర్థిక నష్టాలతో వ్యక్తి ఆత్మహత్య - మృతి

Malkajgiri: నిర్మాణ రంగంలో నష్టాలతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేసిన వసంతపురి కాలనీకి చెందిన మంత్రి బాబురావు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Bodike Manohar, Malkajgiri
Published on: 17 Nov 2026 6:11 PM IST
Malkajgiri
X

Malkajgiri: ఆర్థిక నష్టాలతో వ్యక్తి ఆత్మహత్య - మృతి

మల్కాజిగిరి: నిర్మాణ రంగంలో ఎదురైన ఆర్థిక నష్టాలతో కొంతకాలంగా మానసిక ఆందోళనకు గురవుతున్న ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వసంతపురి కాలనీకి చెందిన మంత్రి బాబురావు (51) నిర్మాణ రంగంలో నష్టాలు రావడంతో గత రెండేళ్లుగా ఇంటి వద్దే ఉంటున్నాడు.

ఈ క్రమంలో మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆయన నవంబరు 16న ఉదయం 11.30 గంటల సమయంలో స్కూటీపై ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. మౌలాలి డీజిల్ లోకో షెడ్ సమీపంలోని ఖాళీ ప్రదేశంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించగా, అదే రోజు సాయంత్రం 4 గంటల సమయంలో మృతి చెందాడు.

ఈ ఘటనపై మృతుడి భార్య మంత్రి సుశ్రుత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనలో ఎలాంటి అనుమానాలు లేవని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.ఈ మేరకు మల్కాజిగిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Bodike Manohar, Malkajgiri

Bodike Manohar, Malkajgiri