Malkajgiri: బాపూజీ సేవలు చిరస్మరణీయం: పద్మశాలి సంఘం నేత శ్రీనివాస్

Malkajgiri: కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయమని కొనియాడిన పిట్టల శ్రీనివాస్.. వచ్చే జయంతి నాటికి మల్కాజిగిరిలో బాపూజీ విగ్రహం ఏర్పాటు చేయాలని కోరారు.

Bodike Manohar, Malkajgiri
Published on: 27 Sept 2026 1:16 PM IST
Malkajgiri
X

Malkajgiri: బాపూజీ సేవలు చిరస్మరణీయం: పద్మశాలి సంఘం నేత శ్రీనివాస్

మల్కాజిగిరి: స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి ప్రదాత, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు దిక్సూచిగా నిలిచిన కొండా లక్ష్మణ్ బాపూజీ త్యాగాలు, సేవలు చిరస్మరణీయమని పద్మశాలి సంఘం నాయకులు పిట్టల శ్రీనివాస్ అన్నారు. బాపూజీ జయంతి సందర్భంగా ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా పిట్టల శ్రీనివాస్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం బాపూజీ జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించకపోవడం దురదృష్టకరమన్నారు. తెలంగాణ ఉద్యమం, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తన సొంత ఇంటిని సైతం ఉద్యమ పార్టీ స్థాపనకు అందించిన మహనీయుడిని గత పాలకులు తగిన విధంగా గుర్తించలేదని పేర్కొన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా బాపూజీ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు.

బాపూజీ పోరాట స్ఫూర్తి, ప్రజాసేవా నిబద్ధత భావితరాలకు మార్గదర్శకమని పేర్కొంటూ, వచ్చే జయంతి నాటికి మల్కాజిగిరిలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బహుజన సంఘాల నాయకులు, పద్మశాలి సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Bodike Manohar, Malkajgiri

Bodike Manohar, Malkajgiri