Malkajgiri: పుష్పగిరి పీఠాధిపతి చేతుల మీదుగా ఘన సన్మానం!

Malkajgiri: బేగంపేట పుష్పగిరి పీఠంలో దర్శనం ఆధ్యాత్మిక పత్రిక వార్షికోత్సవం.. పుష్పగిరి పీఠాధిపతి చేతుల మీదుగా ఘన సన్మానం అందుకున్న డా. తులసి వెంకట రమణాచార్యులు.

Bodike Manohar, Malkajgiri
Published on: 21 Sept 2026 12:55 PM IST
Malkajgiri
X

Malkajgiri: పుష్పగిరి పీఠాధిపతి చేతుల మీదుగా ఘన సన్మానం!

Malkajgiri: దర్శనం ఆధ్యాత్మిక మాస పత్రిక 22వ వార్షికోత్సవం సందర్భంగా బేగంపేటలోని శ్రీ జగద్గురువు శంకరాచార్య పుష్పగిరి పీఠంలో కోలాచల మల్లినాథ వేదికపై నిర్వహించిన శతావధాన కార్యక్రమంలో మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన కవి, రచయిత, అర్చకులు డా. తులసి వెంకట రమణాచార్యులు పృచ్ఛకులుగా పాల్గొన్నారు.

అవధాన కళా కౌముది నల్లాన్ చక్రవర్తుల సాహిత్ తొలి శతావధాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పలు అంశాలపై పృచ్ఛకులు ప్రశ్నలు సంధించగా, అవధాని సాహిత్య, ధారణా ప్రతిభతో సమాధానాలు అందించారు.

కార్యక్రమం అనంతరం పుష్పగిరి పీఠాధిపతి శ్రీమదభినవోద్దండ విద్యాశంకర భారతి స్వామి చేతుల మీదుగా డా. తులసి వెంకట రమణాచార్యులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి ఆశీస్సులు అందజేశారు.

కార్యక్రమంలో దర్శనం ఆధ్యాత్మిక మాస పత్రిక సంపాదకులు మరుమాముల వెంకట రమణ శర్మ, అవధాన విద్యా వికాస పరిషత్ వ్యవస్థాపకులు మరుమాముల దత్తాత్రేయ శర్మ, పూర్వ ప్రభుత్వ సలహాదారు డా. కె.వి. రమణాచారి, మాజీ డీజీపీ అరవింద్ కుమార్, ప్రముఖ సినీనటుడు, కవి, రచయిత తనికెళ్ల భరణి, ప్రముఖ అవధానులు ఆముదాల మురళీ, కడిమిల్ల వరప్రసాద్, మధుర భారతి శ్రీమన్నారాయణతో పాటు పలువురు సాహితీవేత్తలు, కవులు, రచయితలు, సాహిత్యాభిలాషులు పాల్గొన్నారు.

Bodike Manohar, Malkajgiri

Bodike Manohar, Malkajgiri