Malkajgiri: కాంగ్రెస్ నేత కపిలేశ్వర్ బర్త్డే వేళ ఘనంగా అన్నదానం!
Malkajgiri: మల్కాజిగిరి కాంగ్రెస్ నేత కపిలేశ్వర్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈస్ట్ ఆనంద్బాగ్లోని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
Malkajgiri: కాంగ్రెస్ నేత కపిలేశ్వర్ బర్త్డే వేళ ఘనంగా అన్నదానం!
మల్కాజిగిరి: కాంగ్రెస్ పార్టీ నాయకుడు కపిలేశ్వర్ పుట్టినరోజు సందర్భంగా ఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్ పరిధిలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. పుట్టినరోజు వేడుకలను సేవా కార్యక్రమంతో నిర్వహించడం ద్వారా ఆధ్యాత్మికతతో పాటు సామాజిక సేవకు ప్రాధాన్యతనిచ్చారు.
ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కపిలేశ్వర్ను శాలువాతో ఘనంగా సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఈ సందర్భంగా పలువురు నాయకులు అభిలషించారు.
ఆలయ పరిసరాల్లో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందించడంతో పాటు ఆప్యాయత, సేవాభావాన్ని చాటుతాయని నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఆలయ కమిటీ సభ్యులు సనాది శంకర్, కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బజార్ సాయి,రొట్టెల ధరణ్ కుమార్,చుంకు శ్రీను,చెన్నారెడ్డి,అరుణ్, సయ్యద్ మబ్బు, బాలరాజు యాదవ్, చందు, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.




