Malkajgiri: క్యాన్సర్ బాధితుడికి సీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.లక్ష సాయం!
Malkajgiri: మల్కాజిగిరి మౌలాలికి చెందిన క్యాన్సర్ బాధితుడు ఉస్మాన్ అలీకి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సహకారంతో రూ.లక్ష సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్‌ఓసీ పత్రం అందజేశారు.
Malkajgiri: క్యాన్సర్ బాధితుడికి సీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.లక్ష సాయం!
మల్కాజిగిరి, నవంబరు 3: క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న పేద కుటుంబానికి చెందిన ఉస్మాన్ అలీకి వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందించేందుకు కాంగ్రెస్ నాయకులు కృషి చేశారు. మౌలాలి ఆర్టీసీ కాలనీ పరిధిలోని శివానంద్ నగర్‌కు చెందిన ఉస్మాన్ అలీకి నిమ్స్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించేందుకు సుమారు రూ.లక్ష ఖర్చవుతుందని వైద్యులు తెలియజేశారు.
ఈ నేపథ్యంలో బాధిత కుటుంబానికి అండగా నిలిచేందుకు మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.లక్ష ఆర్థిక సాయం మంజూరుకు సంబంధించిన ఎల్‌ఓసీని అందజేశారు. ఈ సందర్భంగా బాధితుడిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. శస్త్రచికిత్సకు అవసరమైన ఆర్థిక సహాయం అందేలా తమ వంతు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మౌలాలి డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు పోతుల వినోద్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకన్న, ప్రధాన కార్యదర్శి సలీం, సీనియర్ నాయకుడు ఫారూఖ్, జిల్లా కార్యదర్శి మందా భాస్కర్, జిల్లా సంయుక్త కార్యదర్శి ప్రేమ్ కుమార్, చంద్రకాంత్, మల్కాజిగిరి యువజన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అజయ్, మౌలాలి మైనారిటీ అధ్యక్షుడు షకీల్, పాండురంగాచారి, బాబా ప్రవీణ్ తదితరులు, కాలనీవాసులు పాల్గొన్నారు.




