Malkajgiri: మల్కాజిగిరి చింతల్‌బస్తీలో ఘనంగా గణేష్ నిమజ్జనం!

Malkajgiri: మల్కాజిగిరి చింతల్‌బస్తీలో ఘనంగా గణేష్ నిమజ్జనం. శ్రీ రుద్ర ఫ్రెండ్స్ అసోసియేషన్ వేడుకల్లో పాల్గొన్న ఎస్సీ సంక్షేమ సంఘం, ఎంజేఎఫ్, ఎంఈఎఫ్ నాయకులు.

Bodike Manohar, Malkajgiri
Published on: 21 Sept 2026 11:01 PM IST
Malkajgiri
X

Malkajgiri: మల్కాజిగిరి చింతల్‌బస్తీలో ఘనంగా గణేష్ నిమజ్జనం!

మల్కాజిగిరి: మల్కాజిగిరి చింతల్‌బస్తీలో శ్రీ రుద్ర ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గణేష్ నిమజ్జనం వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా మల్కాజిగిరి ఎస్సీ సంక్షేమ సంఘం నాయకులు సంధి నర్సింగరావు మాదిగ, ఎం జె ఎఫ్ రాష్ట్ర నాయకుడు మనోహర్, ఎం ఈ ఎఫ్ నాయకులు రాపోలు ఆనంద్ తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వినాయకుడికి పూజలు చేసి, భక్తులతో కలిసి నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు నిర్వాహకులు చేపట్టిన ఏర్పాట్లను వారు అభినందించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడికి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో శ్రీరాము ఉపేందర్, జీలుగు కృష్ణ,యాదగిరి, గణేష్,అర్జున్,శ్రీకాంత్, శ్రీను ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Bodike Manohar, Malkajgiri

Bodike Manohar, Malkajgiri