Malakpet: మలక్ పేటలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఫ్లాగ్ మార్చ్!
Malakpet: సెప్టెంబర్ 25న గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో మలక్ పేటలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) సిబ్బందితో కలిసి పోలీసుల ఫ్లాగ్ మార్చ్.
Malakpet: మలక్ పేటలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఫ్లాగ్ మార్చ్!
Malakpet: గణేశ్ ఉత్సవాలు, సెప్టెంబర్ 25న జరగనున్న విగ్రహాల నిమజ్జనం నేపథ్యంలో మలక్ పేట పోలీసులు రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) సిబ్బందితో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. శాంతిభద్రతలను కాపాడటం, మత సామరస్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ కవాతు చేపట్టారు.
మలక్ పేట ఏసీపీ వెంకట్ రెడ్డి నేతృత్వంలో పీఎస్ పరిధిలోని సుమారు ఏడు కిలోమీటర్ల మేర ఈ ఫ్లాగ్ మార్చ్ జరిగింది. పండుగ సమయంలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా చూసేందుకు పోలీసు శాఖ సిద్ధంగా ఉందని ఈ ఫ్లాగ్ మార్చ్ ద్వారా ప్రజలకు భరోసా కల్పించారు. గణేశ్ మండపాల నిర్వాహకులు, ఊరేగింపులో పాల్గొనేవారు పోలీసుల నిబంధనలు, సూచనలను కచ్చితంగా పాటించాలని ఏసీపీ తెలిపారు.
పోలీసులు సూచించిన మార్గాల్లో, నిర్దేశిత సమయంలోనే ఊరేగింపులు జరపాలని, ట్రాఫిక్‌కు లేదా ప్రజలకు ఎలాంటి అసౌకర్యo కలిగించవద్దని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని, అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.




