Osmania University: పూలే వర్ధంతి సభను విజయవంతం చేయాలి

Osmania University: నవంబర్ 28న ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించనున్న మహాత్మా జ్యోతిబా పూలే 136వ వర్ధంతి సభ పోస్టర్ ఆవిష్కరించిన బీసీఎస్ఎఫ్ నేత కొమ్మనబోయిన సైదులు యాదవ్.

HARISH, TARNAKA
Published on: 23 Nov 2026 6:46 PM IST
Osmania University
X

Osmania University: పూలే వర్ధంతి సభను విజయవంతం చేయాలి

ఉస్మానియా యూనివర్సిటీ: ఆధునిక భారతదేశ సంఘ సంస్కర్త, సామాజిక ఉద్యమాల పితామహుడు మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాలను కొనసాగించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని బీసీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కొమ్మనబోయిన సైదులు యాదవ్ అన్నారు. ఈ నెల 28న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న పూలే 136వ వర్ధంతి సభ పోస్టర్‌ను ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వేల సంవత్సరాలుగా సమాజంలో పాతుకుపోయిన కుల, వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడు పూలే అని కొనియాడారు. పూలే దంపతుల త్యాగాల ఫలితంగానే నేడు బహుజన సమాజంలో విద్యావికాసం సాధ్యమైందన్నారు. పూలే స్థాపించిన సత్యశోధక్ సమాజ్ ఆధునిక భారత నిర్మాణానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. ఈ నెల 28న జరిగే వర్ధంతి సభకు విద్యార్థులు, ప్రొఫెసర్లు, మేధావులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఏఐఓబీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల మధు, వీజేఎస్ ఓయూ అధ్యక్షుడు చెరుకు శివ, విద్యార్థి నాయకులు వర్కాల సాయికిరణ్, రామకృష్ణారెడ్డి, ప్రభాకర్, ఓయూ లా కళాశాల విద్యార్థి రోహన్, అనిల్, మనోజ్, సురేష్, గిరి తదితరులు పాల్గొన్నారు.

HARISH, TARNAKA

HARISH, TARNAKA