Hyderabad: రాంలీలా మైదానంలో కాంగ్రెస్ ధర్నాను జయప్రదం చేయాలి: అద్దంకి
Hyderabad: నవంబర్ 1న ఢిల్లీ రాంలీలా మైదానంలో కాంగ్రెస్ ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్, బీజేపీ వైఖరిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Hyderabad: రాంలీలా మైదానంలో కాంగ్రెస్ ధర్నాను జయప్రదం చేయాలి: అద్దంకి
Hyderabad: అద్దంకి దయాకర్, ప్రభుత్వ విప్, నవంబర్ 1న రాంలీలా మైదానంలో కాంగ్రెస్ తలపెట్టిన ధర్నాను విజయవంతం చేయాలి.. ధర్నా నిర్వహించకుండా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి ఆటంకాలు కల్పించాలని బీజేపీ ప్రయత్నం చేస్తోంది.. కాంగ్రెస్ కేడర్ అంతా ఢిల్లీ బాట పడుతుంటే అమిత్ షా గల్లీ బాట పడుతున్నాడు.
దక్షిణ భారతదేశంలో బీజేపీ వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయి.. లోక్తంత్ర్ బచావో.. అరాచకం హఠావో అని అమిత్ షా పాదయాత్రకు విచిత్రమైన పేరును బీజేపీ పెట్టింది.. బంగారు పళ్లెంలో పెట్టి కాంగ్రెస్‌కు అధికారం ఇవ్వడానికి బీజేపీ సిద్ధమైంది.. ధర్నా చౌక్‌ను క్లోజ్ చేసినట్లు ఢిల్లీలో జంతర్ మంతర్‌ను బీజేపీ ప్రభుత్వం క్లోజ్ చేసింది.
ఇలాంటి అమిత్ షా హైదరాబాద్‌లో ట్యాంక్ బండ్‌పై పాదయాత్ర చేయడానికి వస్తున్నాడు.. అమిత్ షా ఎందుకు హైదరాబాద్‌కు వస్తున్నాడు.. బీజేపీ భయపడుతోంది.. వాళ్ల దొంగతనం బయటపడింది.. జ్ఞానేష్ కుమార్‌తో కలిసి ఎస్ఐఆర్ పేరుతో బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది.. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత బీజేపీకి లేదు.
రాజరికం పోయిన ప్రజాస్వామ్యం కావాలని బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ కోరుకుంది.. చంద్రబాబు, నితీష్ కుమార్ పుణ్యాన బీజేపీ మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది.. ఖూనీ చేసిన వాళ్లే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు.. ఏ మొహం పెట్టుకుని కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో బీజేపీ నాయకులు ర్యాలీకి వస్తున్నారు..? బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావుకు నాంపల్లి ఆఫీసులో పని లేదు.. ఆయనకు పని లేక కొండారెడ్డిపల్లి, కొడంగల్ గురించి మాట్లాడుతున్నాడు.
మా కాంగ్రెస్ ఓట్లను గద్ద నుంచి కోడిపిల్లలను కాపాడుకున్నట్లు కాపాడుకోవాల్సి వస్తోంది.. దేశంలో 13 కోట్ల ఓట్లను ఇప్పటికే ఎస్ఐఆర్ ప్రక్రియ పేరుతో తొలగించారు.. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు దేశంలో 120 కోట్ల జనాభా ఉంది.. ఇప్పుడు అది 140 కోట్లకు పైగా చేరింది.. ఒకవైపు జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి..? ఓటు పోయిందని 13 కోట్ల మంది మొత్తుకుంటున్నా ఎన్నికల కమిషన్ పట్టించుకోవడం లేదు.
దేశ పౌరుడినని నిరూపించుకోవాల్సిన పరిస్థితి కల్పించారు.. ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడం కోసం ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారు.. రాజకీయ ప్రయోజనాల కోసం ఓటును తొలగిస్తున్నారు.. ప్రజాస్వామ్యం అంటే మోదీ, అమిత్ షాకు అర్థం తెలియదు.. ప్రజాస్వామ్యంలో ఓటు తొలగించడం అంటే తల్లిపాలు తాగి రొమ్ము గుద్దడమే.. బీజేపీ పాపాలు పరాకాష్టకు చేరుకున్నాయి.
కాంగ్రెస్‌కు ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, లౌకికవాదం గురించి బీజేపీ చెప్పడం విడ్డూరం.. తాతకు దగ్గులు నేర్పినట్లుగా బీజేపీ నేతల తీరు ఉంది.. ప్రజాస్వామ్యంలో మోదీ కాదు, ఆయన అబ్బ కూడా దిగిపోవాల్సిందే.. బీజేపీని, ప్రధాని మోదీని తిడితే దేశాన్ని తిట్టినట్లుగా చిత్రీకరిస్తున్నారు.. బీజేపీ నాయకులు మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూని, కాంగ్రెస్ సీనియర్ నేతలను కూడా దూషిస్తున్నారు.. దేశంలో 12 రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను కూల్చిన చరిత్ర బీజేపీకి ఉంది.
ఈడీ, ఐటీ, సీబీఐ, ఎన్నికల సంఘం ఇలా అన్నింటినీ ఉపయోగించి, ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి బీజేపీ ప్రభుత్వాలను, పార్టీలను కూల్చుతోంది.. నవంబర్ 1న రాంలీలా మైదానంలో కాంగ్రెస్ సభకు పోటీగా హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర కార్యక్రమం పెట్టారు.. నా ఇండియా ఫైల్స్ సినిమాలో బీజేపీ మనువాదాన్ని చూపిస్తా.. అప్రకటిత ఎమర్జెన్సీని బీజేపీ అమలు చేస్తోంది.. ఎన్డీఏ కూటమి నుంచి బయటకు రమ్మని చంద్రబాబును కోరుతున్నా.
నిధుల పేరుతో చంద్రబాబు లాంటి నాయకులను బీజేపీ మభ్యపెడుతోంది.. ఎన్డీఏ కూటమిలో ఉన్న అనేక పార్టీలను బీజేపీ మాయం చేసింది.. బీజేపీతో పొత్తు అంటే అది విష కౌగిలే.. బీఆర్ఎస్తో బీజేపీ పొత్తు చర్చలు జరుగుతున్నాయి.. ప్రజల చేతిలో బీజేపీకి ఓటమి తప్పదు.. ప్రధాని మోదీతో దేశానికి ఏ మాత్రం లాభం లేదు.. మోదీ విదేశాంగ విధానంపై విమర్శలున్నాయి.




