Maisammaguda: నర్శింహారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో సైబర్ సెక్యూరిటీ సెంటర్ ప్రారంభం

Maisammaguda: మైసమ్మగూడ నర్శింహారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో సుప్రజ టెక్నాలజీస్ సహకారంతో సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఘనంగా ప్రారంభించారు.

NAKSHATRAM, MEDCHAL
Published on: 14 Nov 2026 5:57 PM IST
Maisammaguda
X

Maisammaguda: నర్శింహారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో సైబర్ సెక్యూరిటీ సెంటర్ ప్రారంభం

మైసమ్మగూడ: మైసమ్మగూడలోని నర్సింహారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో సైబర్ సెక్యూరిటీ విభాగంలో అత్యాధునిక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఘనంగా ప్రారంభించారు. సుప్రజ టెక్నాలజీస్ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో 250కి పైగా సాఫ్ట్‌వేర్ అప్లికేషన్లు, టూల్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఈ సందర్భంగా సుప్రజ టెక్నాలజీస్ ప్రతినిధులు మాట్లాడుతూ విద్యార్థుల్లో పరిశోధన, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తామని తెలిపారు. కళాశాల కార్యదర్శి జె. త్రిశూల్ రెడ్డి మాట్లాడుతూ సైబర్ నేరాలను ఎదుర్కొనే నైపుణ్యాలను విద్యార్థులు పెంపొందించుకోవడానికి ఈ కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.

కళాశాల డైరెక్టర్ డా. ఏ. మోహన్, ప్రిన్సిపాల్ డా. ఆర్. లోకనాథం మాట్లాడుతూ విద్యార్థులకు థియరీతో పాటు ప్రాక్టికల్ శిక్షణ అందించి, సైబర్ సెక్యూరిటీ రంగంలో నిపుణులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ జె. నర్సింహారెడ్డి, కార్యదర్శి జె. త్రిశూల్ రెడ్డి, ఇతర ప్రముఖులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు...

NAKSHATRAM, MEDCHAL

NAKSHATRAM, MEDCHAL