Vikarabad: వికారాబాద్ అనంతగిరిపల్లిలో ఘనంగా వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్టాపన
Vikarabad: వికారాబాద్ వార్డు నెం.10 అనంతగిరిపల్లిలో వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అర్థ సుధాకర్ రెడ్డి పూజలు చేశారు.
Vikarabad: వికారాబాద్ అనంతగిరిపల్లిలో ఘనంగా వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్టాపన
వికారాబాద్: వికారాబాద్ పట్టణంలోని వార్డు నెం.10 అనంతగిరిపల్లి లో వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఈ పూజా కార్యక్రమంలో వికారాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ అర్థ సుధాకర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదికావ్యమైన రామాయణాన్ని రచించి సమాజానికి ధర్మ మార్గాన్ని చూపిన మహర్షి వాల్మీకి గారి ఆశయాలను మనమంతా కొనసాగించాలని, వాల్మీకి మహర్షి చూపిన బాటలో నడవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో టౌన్ వైస్ ప్రెసిడెంట్ రెడ్డి నాయక్. మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాజు నాయక్. సోషల్ మీడియా నందు. బోయ బాలరాజు. కురువ శీను. బాబు నాయక్ మోహన్ నాయక్. నర్సింలు.వార్డు ప్రజలు, వాల్మీకి సంఘం యూత్. పెద్దలు,కార్యకర్తలు పాల్గొన్నారు.




