Vikarabad: తాండూరు గోశాలలో ఘనంగా మహారుద్రాభిషేకం.. భక్తుల సందడి!

Vikarabad: వికారాబాద్ జిల్లా తాండూరు గోశాలలో గోశాల సేవా సమితి ఆధ్వర్యంలో మహారుద్రాభిషేకం ఘనంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

Srikanth Reddy, Tandur
Published on: 24 Nov 2026 1:57 PM IST
Vikarabad
X

Vikarabad: తాండూరు గోశాలలో ఘనంగా మహారుద్రాభిషేకం.. భక్తుల సందడి!

Vikarabad: తాండూరు గోశాల సేవా సమితి ఆధ్వర్యంలో తాండూరు గోశాలలో ‘మహారుద్రాభిషేకం కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా జరిగింది. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి సంబంధించి ముఖ్య అతిథులకు తాండూరు నియోజకవర్గ గోమాత భక్తుల తరపున ఘనంగా ఆహ్వానం పలికారు.

వేణుగోపాల రెడ్డి ప్రత్యక్ష పర్యవేక్షణలో నియోజకవర్గ గోమాత భక్తులు మరియు భక్తులందరికీ ఈ మహా క్రతువులో పాల్గొని గొప్ప అవకాశం లభించింది. వికారాబాద్‌కు చెందిన దైవజ్ఞ శ్రీ విశ్వం పంతులు ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు జరిగాయి.

తాండూరుకు చెందిన శ్రీ సాయిపుత్ర హోమ్స్ ఎండీ శ్రీ బానోళ్ల శంకర్ యాదవ్,చంద్రకళ దంపతులు ఈ మహారుద్రాభిషేక పూజను నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పరమశివుని కృపకు పాత్రులు అయ్యారు.

Srikanth Reddy, Tandur

Srikanth Reddy, Tandur