Madugula: మైబయ్య కుటుంబానికి బీఆర్ఎస్ నేత ఆర్థిక శివకుమార్ గౌడ్ సాయం
Madugula: మాడుగుల మండలం అన్నెబోయినపల్లిలో మృతి చెందిన మైబయ్య కుటుంబాన్ని బీఆర్ఎస్ నేత కొప్పుల శివకుమార్ గౌడ్ పరామర్శించి ఆర్థిక సాయం అందించారు.
Madugula: మైబయ్య కుటుంబానికి బీఆర్ఎస్ నేత ఆర్థిక శివకుమార్ గౌడ్ సాయం
రంగారెడ్డి జిల్లా: మాడుగుల మండలం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన రావణంపల్లి మైబయ్య కుటుంబాన్ని సుద్దపల్లి గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొప్పుల శివకుమార్ గౌడ్ పరామర్శించారు.
అన్నెబోయినపల్లి గ్రామంలో మైబయ్య కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి మనోధైర్యం కల్పిస్తూ రూ.3,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలవడం సామాజిక బాధ్యత అని, కష్టకాలంలో బాధిత కుటుంబాలకు తోడుగా ఉండాలనే ఉద్దేశంతో ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు.
మైబయ్య కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అన్నెబోయినపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు ముల జంగయ్య, ఇ. గణేష్, ఆర్. నర్సింహా, ముత్యాలు, పి. పోలే శేఖర్, సుద్దపల్లి మాజీ ఎంపీటీసీ గ్యార వెంకటయ్య (చంటి బాబు), కొప్పుల శ్రీరాములు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.




