Hayathnagar: బొడ్రాయి ప్రథమ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న మధుయాష్కిగౌడ్!
Hayathnagar: హయత్‌నగర్ ఓల్డ్ విలేజ్‌లో బొడ్రాయి ప్రతిష్ఠాపన ప్రథమ వార్షికోత్సవ వేడుకలకు మాజీ ఎంపీ మధుయాష్కిగౌడ్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Hayathnagar: బొడ్రాయి ప్రథమ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న మధుయాష్కిగౌడ్!
Hayathnagar: హయత్‌నగర్ ఓల్డ్ విలేజ్‌లో నిర్వహించిన బొడ్రాయి ప్రతిష్ఠాపన ప్రథమ వార్షికోత్సవ వేడుకలకు ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ చైర్‌పర్సన్, మాజీ ఎంపీ మధుయాష్కిగౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి, తాజా మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి, యాదవ కార్పొరేషన్ వైస్ చైర్మన్ గజ్జి భాస్కర్ యాదవ్, డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు చెన్నగోని రవీందర్ గౌడ్‌లతో కలిసి బొడ్రాయికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని మధుయాష్కిగౌడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




