LB Nagar: కర్మన్‌ఘాట్‌లో ఘనంగా శ్రీ బీరప్ప స్వామి-కామరాతి దేవీల కళ్యాణ మహోత్సవం!

LB Nagar: కర్మన్‌ఘాట్‌లో జరిగిన శ్రీ బీరప్ప స్వామి-కామరాతి దేవీల కళ్యాణ మహోత్సవానికి AIPC చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 26 Oct 2026 5:24 PM IST
LB Nagar
X

LB Nagar: కర్మన్‌ఘాట్‌లో ఘనంగా శ్రీ బీరప్ప స్వామి-కామరాతి దేవీల కళ్యాణ మహోత్సవం!

LB Nagar: కర్మన్‌ఘాట్‌ లోని శ్రీ బీరప్ప స్వామి–కామరాతి దేవీ ల కళ్యాణ మహోత్సవానికి ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్మన్, మాజీ ఎంపీ, ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మధుయాష్కి గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బీరప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు.

అనంతరం కళ్యాణ మహోత్సవ నిర్వహణ కమిటీ ప్రతినిధులు మధుయాష్కి గౌడ్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మధుయాష్కి గౌడ్ మాట్లాడుతూ.. బీరప్ప స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ తమ కుటుంబాలతో సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖశాంతులు, సిరిసంపదలు వెల్లివిరియాలని కోరుకున్నారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR