LB Nagar: రాహుల్, ప్రియాంక గాంధీల అరెస్టు అక్రమం: మధుయాష్కి గౌడ్!

LB Nagar: రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టును ఖండిస్తూ, ఎస్ఐఆర్ పేరుతో దేశంలో 13 కోట్ల ఓట్లు తొలగించారని మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 6 Oct 2026 10:22 PM IST
LB Nagar
X

LB Nagar: రాహుల్, ప్రియాంక గాంధీల అరెస్టు అక్రమం: మధుయాష్కి గౌడ్!

ఎల్బీనగర్: ఎస్ఐఆర్ ద్వారా ఓట్ల తొలగింపును నిరసిస్తూ శాంతియుత నిరసన ర్యాలీ చేపట్టిన లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు , పార్టీ నేతలను అరెస్టు చేయడాన్ని ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ చైర్ పర్సన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ గారు తీవ్రంగా ఖండించారు. వారి అరెస్టు అక్రమమన్నారు.

అరెస్టుల పేరుతో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గార్ల మనోస్థైర్యాన్ని దెబ్బతీయ లేరని, ఆనాడు స్వాతంత్ర పోరాటంలో గాంధీల త్యాగం మరువలేనిదని.. రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో దేశంలో మరో స్వాతంత్ర పోరాటం ప్రారంభమైందని పేర్కొన్నారు.

ఎస్ఐఆర్ పేరుతో దేశంలోని పేదల ఓట్లను తొలగించే అధికారం ఎన్నికల సంఘానికి ఎవరు ఇచ్చారని మధుయాష్కి గారు ప్రశ్నించారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్.. మోడీ, అమిత్ షా చేతిలో కీలుబొమ్మగా మారాడని విమర్శించారు.

బీజేపీ కి వ్యతిరేకంగా ఓటు వేసే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ తదితర పేద వర్గాలకు చెందిన పేర్లనే లక్ష్యంగా చేసుకొని.. దేశవ్యాప్తంగా సుమారు 13 కోట్ల ఓట్లను తొలగించడం దేశద్రోహ చర్యని విమర్శించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ అనంతరం జరిగిన ఎన్నికలన్నీ బోగసేనని, ఓటు చోరీ తోనే బీజేపీ సీట్లు గెలుస్తూ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు.

ఫామ్- 6లో ఇష్టారీతిన మార్పులు చేస్తూ .. కొత్త ఓట్ల నమోదులోనూ కొర్రీలు పెడుతుండడం స్వాతంత్ర భారతదేశ చరిత్రలో మొదటిసారి అన్నారు. ప్రతిపక్ష పార్టీలు అన్ని ఏకమై.. సీఈసీ జ్ఞానేష్ కుమార్ ను తొలగించి, ఓటు చోరీని అడ్డుకోవాలన్న డిమాండ్ తో ఢిల్లీలో ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ అగ్ర నేతలను, ఇతర నాయకులను అరెస్టు చేయడం దేశ ప్రజలందరూ ఖండించాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జరుగుతున్న ఈ ఉద్యమంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని మధుయాష్కి గారు కోరారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR