Madhapur: మాదాపూర్‌లో కత్తితో దాడి చేసి సెల్‌ఫోన్ దోచుకున్న నిందితుల అరెస్ట్!
Madhapur: హైదరాబాద్ మాదాపూర్ దుర్గం చెరువు మెట్రో స్టేషన్ వద్ద వ్యక్తిపై కత్తితో దాడి చేసి ఫోన్ దోచుకున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.
Madhapur: మాదాపూర్‌లో కత్తితో దాడి చేసి సెల్‌ఫోన్ దోచుకున్న నిందితుల అరెస్ట్!
Madhapur: మాదాపూర్ దుర్గం చెరువు మెట్రో స్టేషన్ సమీపంలో ఒంటరిగా వెళ్తున్న వ్యక్తిపై కత్తితో దాడి చేసి, ఫోన్ దోపిడీకి పాల్పడిన ఘటనలో ఇద్దరు నిందితులను మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
వనగండ్ల నరేష్ (19), కూర్మ నవీన్ (19) అనే ఇద్దరు యువకులు రాత్రి వేళల్లో ఒంటరిగా వెళ్లే వారిని కత్తులతో బెదిరిస్తూ దాడులకు పాల్పడుతూ సెల్‌ఫోన్లు లాక్కుంటున్నారు. దుర్గం చెరువు మెట్రో స్టేషన్ వద్ద ఒక వ్యక్తిపై కత్తితో దాడి చేసి ఫోన్ దోచుకెళ్లారు.
బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన మాదాపూర్ క్రైమ్ టీమ్, అయ్యప్ప సొసైటీ పరిసర ప్రాంతాల్లో నిందితులు అనుమానాస్పదంగా తిరుగుతుండగా వారిని వెంటాడి పట్టుకున్నారు. అరెస్ట్ చేసిన నిందితుల వద్ద నుంచి 2 దొంగిలించిన సెల్‌ఫోన్లతో పాటు దాడికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో రెండు వేర్వేరు కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.




