Madhapur: శిల్పారామంలో బతుకమ్మ సంబరాలు.. ‘ఆది బజార్’ ప్రారంభం!

Madhapur: మాదాపూర్ శిల్పారామంలో బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి. ట్రైబల్ డిపార్ట్‌మెంట్ ‘ఆది బజార్’ మేళాను స్పెషల్ ఆఫీసర్ కిషన్ రావు ప్రారంభించారు.

VISHWANATH, SHERILINGAMPALLY
Published on: 14 Oct 2026 8:41 PM IST
Madhapur
X

Madhapur: శిల్పారామంలో బతుకమ్మ సంబరాలు.. ‘ఆది బజార్’ ప్రారంభం!

మాదాపూర్: మాదాపూర్ శిల్పారామం వేదికగా బతుకమ్మ పండుగ వేడుకలు అంబరాన్నంటాయి. పండుగను పురస్కరించుకుని శిల్పారామం మహిళా సిబ్బంది ఎంతో ఉత్సాహంగా బతుకమ్మలను అందంగా పేర్చి, సందర్శకులతో కలిసి సాయంత్రం వేళ భక్తిశ్రద్ధలతో బతుకమ్మ ఆటలాడారు.

ఇదే వేదికపై ట్రైబల్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో పది రోజుల పాటు నిర్వహించనున్న ప్రత్యేక *"ఆది బజార్"* మేళాను శిల్పారామం స్పెషల్ ఆఫీసర్ కిషన్ రావు ఘనంగా ప్రారంభించారు. ఈ మేళాలో భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ఆదివాసీలు తమ సంప్రదాయ ఉత్పత్తులు, హస్తకళలను సందర్శకులకు అందుబాటులో ఉంచారు. గిరిజన సంస్కృతికి అద్దం పట్టే ఈ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

ఈ ప్రారంభోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. నాట్య గురువు ప్రమోద్ రెడ్డి శిష్య బృందం దాదాపు 60 మంది కళాకారులతో ప్రదర్శించిన భరతనాట్య ప్రదర్శనలు అద్భుతంగా సాగాయి. ముఖ్యంగా "దేవి కీర్తన మాలిక" మరియు "దేవి వైభవం" అంశాలను వారు చక్కని అభినయంతో ప్రదర్శించి, అమ్మవార్ల రూపాన్ని కళ్ళకు కట్టినట్లుగా చూపించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు.

VISHWANATH, SHERILINGAMPALLY

VISHWANATH, SHERILINGAMPALLY