Madhapur: విషాదం ప్రియుడికి వీడియో కాల్ చేస్తూ వివాహిత ఆత్మహత్య!

Madhapur: హైదరాబాద్ మాదాపూర్ పరిధిలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన అర్చన చౌదరి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

VISHWANATH, SHERILINGAMPALLY
Updated on: 25 Oct 2026 11:59 AM IST
Madhapur
X

Madhapur: విషాదం ప్రియుడికి వీడియో కాల్ చేస్తూ వివాహిత ఆత్మహత్య!

Madhapur: పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఉత్తరప్రదేశ్‌కు చెందిన అర్చన చౌదరి మాలిక్ అనే వివాహిత మాదాపూర్, చంద్ర నాయక్ తండాలోని 'ఎస్ఆర్ సద్గురు రెసిడెన్సీ'లో నివసిస్తోంది. ఆమె తన సహోద్యోగి అయిన భండారీ విమల్‌తో గత నాలుగేళ్లుగా ప్రేమలో ఉంది. ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలని అర్చన అతడిపై ఒత్తిడి తెచ్చింది. దీనిపై ఇద్దరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో అర్చన, విమల్‌కు వీడియో కాల్ చేసి మాట్లాడింది. సంభాషణ సమయంలో గొడవ తీవ్రమవ్వడంతో ఆమె తన చున్నీని ఫ్యాన్‌కు కట్టి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది.

వెంటనే డయల్ 112 ద్వారా సమాచారం అందుకున్న పెట్రోలింగ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫ్లాట్ తలుపులు తెరిచి చూడగా అర్చన ఫ్యాన్‌కు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. స్థానిక పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పంచనామా అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

VISHWANATH, SHERILINGAMPALLY

VISHWANATH, SHERILINGAMPALLY