Madhapur: మాధాపూర్ నవభారత్ నగర్‌లో హైడ్రా ముమ్మర కూల్చివేతలు!

Madhapur: మాధాపూర్ నవభారత్ నగర్‌లో హైడ్రా కూల్చివేతలు. బాధితులకు మద్దతు తెలిపిన బిఆర్ఎస్ నాయకుడు కార్తీక్ రాయల అరెస్ట్. బాధితుల ఆవేదన.

VISHWANATH, SHERILINGAMPALLY
Published on: 30 Oct 2026 12:12 PM IST
Madhapur
X

Madhapur: మాధాపూర్ నవభారత్ నగర్‌లో హైడ్రా ముమ్మర కూల్చివేతలు!

Madhapur: హైదరాబాద్ మాధాపూర్ పరిధిలోని నవభారత్ నగర్‌లో హైడ్రా అధికారులు చేపట్టిన ముమ్మర కూల్చివేతలు స్థానికుల్లో ఆగ్రహానికి కారణమయ్యాయి.

కూల్చివేతల సమాచారం అందుకోవడంతోనే బిఆర్ఎస్ నాయకులు బాధితులకు మద్దతుగా వెంటనే నవభారత్ నగర్ కాలనీకి చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు రంగప్రవేశం చేసి బిఆర్ఎస్ నాయకుడు కార్తీక్ రాయల తో పాటు పలువురు నాయకులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.

మరోవైపు ఇళ్లను కూల్చివేయడంతో బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇళ్లలో ఉన్న నిత్యావసరాలు, సామాన్లు కూడా బయటకు తీసుకోకముందే జెసిబిలతో ఇళ్లను నేలమట్టం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు సమాచారం లేదా నోటీసులు ఇవ్వకుండా ఉన్నపళంగా హైడ్రా కూల్చివేతలు ఎలా చేపడుతుందని బిఆర్ఎస్ నాయకులు ప్రభుత్వాన్ని, అధికారులను నిలదీశారు.

VISHWANATH, SHERILINGAMPALLY

VISHWANATH, SHERILINGAMPALLY