Madhapur: మాదాపూర్‌లో ప్రభుత్వ పశువైద్యశాల, డెయిరీ కూల్చివేతపై కేసు
Madhapur: మాదాపూర్‌లో ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ పశువైద్యశాల, విజయ మిల్క్ డెయిరీ భవనాన్ని కూల్చివేసిన ఘటనపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Madhapur: మాదాపూర్‌లో ప్రభుత్వ పశువైద్యశాల, డెయిరీ కూల్చివేతపై కేసు
మాదాపూర్: మాదాపూర్ పరిధిలోని మెట్రో పిల్లర్ నంబర్ C-1744 సమీపంలో ఉన్న 'విజయ మిల్క్ డెయిరీ' భవనాన్ని ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా కూల్చివేశారన్న ఆరోపణలపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
మాదాపూర్ యూత్ అసోసియేషన్ సభ్యుడు మల్లాల రాజు యాదవ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. ఈ నెల 11వ తేదీ రాత్రి సుమారు 11:00 గంటల సమయంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు హిటాచీ, సహాయంతో పశువైద్యశాల విజయ మిల్క్ డెయిరీ భవనాన్ని కూల్చివేస్తున్నట్లు ఆయనకు సమాచారం అందింది.వెంటనే ఆయన ఎం. శ్రవణ్ కుమార్ యాదవ్, గోపాల్ ముదిరాజ్, ఎం. మహేష్ యాదవ్, పరమేష్ యాదవ్‌లతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
అక్కడ "CMC" స్టిక్కర్ ఉన్న హిటాచీ వాహనంతో భవనాన్ని కూల్చివేస్తుండటాన్ని వారు గమనించారు. విచారించగా, కూల్చివేతకు పాల్పడుతున్న వ్యక్తులు అనే సంస్థకు చెందినవారని తెలిసింది. అనుమతులు లేకుండా భవనాన్ని ఎందుకు కూల్చివేస్తున్నారని ఫిర్యాదుదారు, స్థానికులు ప్రశ్నించి పనులను అడ్డుకునే ప్రయత్నం చేయగా, సదరు వ్యక్తులు వారిని అడ్డుకుని అసభ్య పదజాలంతో దూషించారు.
ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండా భవనాన్ని ధ్వంసం చేయడంతో పాటు, అడ్డుకున్న తమను దూషించిన సదరు కంపెనీ యాజమాన్యంపై, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాజు యాదవ్ తన ఫిర్యాదులో కోరారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.




