Talakondapally: లింగారావుపల్లిలో 'మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి'
Talakondapally: తలకొండపల్లి మండలం లింగారావుపల్లిలో నిర్మాణం పూర్తయిన ఇళ్ల వద్ద లబ్ధిదారులతో కలిసి ప్రజాప్రతినిధులు ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ జరుపుకున్నారు.
Talakondapally: లింగారావుపల్లిలో 'మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి'
రంగారెడ్డి జిల్లా: తలకొండపల్లి మండలం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా తలకొండపల్లి మండలం లింగారావుపల్లి గ్రామపంచాయతీ పరిధిలో నిర్మాణం పూర్తయిన ఇళ్ల వద్ద ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, తలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాసు శ్రీనివాస్ రెడ్డి పాల్గొని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పేద కుటుంబాల సొంతింటి కల సాకారం కావడం సంతోషకరమన్నారు. ప్రతి పేద కుటుంబం సొంతింటిలో ఆనందంగా పండుగలు జరుపుకోవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ గట్ల కేశవరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ శ్యామ్ సుందర్ రెడ్డి, ఉప సర్పంచ్ బూత్కూరు వెంకటరెడ్డి, పంచాయతీ కార్యదర్శి మహేష్, గ్రామ పాలకవర్గ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, గ్రామ పెద్దలు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




