Kadtal: కడ్తాల్లో 'మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి' వేడుకలు
Kadtal: కడ్తాల్ గ్రామపంచాయతీ పరిధిలో నూతన ఇందిరమ్మ ఇళ్ల వద్ద సర్పంచ్ రాయికంటి భిక్షపతి అధ్యక్షతన ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు ఘనంగా జరిగాయి.
Kadtal: కడ్తాల్లో 'మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి' వేడుకలు
కడ్తాల్: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం కడ్తాల్ గ్రామపంచాయతీ పరిధిలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల వద్ద ఆదివారం ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ రాయికంటి భిక్షపతి అధ్యక్షతన, మండల పంచాయతీ అధికారి ఎల్. లాలయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు పాల్గొని లబ్ధిదారులతో కలిసి దీపావళి సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల ప్రాంగణాలు పండుగ శోభను సంతరించుకున్నాయి. ప్రభుత్వం పేదలకు సొంతింటి కలను సాకారం చేయడంలో భాగంగా నిర్మించిన ఇళ్ల వద్ద దీపావళి వేడుకలు నిర్వహించడం విశేషంగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ గూడూరు భాస్కర్ రెడ్డి, ఉప సర్పంచ్ ఈ. రెడ్డి యాదగిరి రెడ్డి, వార్డు సభ్యులు పెరుమాళ్ల లక్ష్మమ్మ, నూర్జహాన్ బేగం, కర్రోళ్ల కృష్ణవేణి, ఎర్రోళ్ల రాఘవేంద్ర, మంకీ మహేష్, ముత్తి కృష్ణ, దుడ్డు పూలమ్మ, కొప్పు వసంత, చేగూరి మమత, కరంటోత్ విజయకుమార్, కళ్యాణ్కర్ భాను కిరణ్, మాదారం గణేష్ గౌడ్, వాంకడావత్ రవి, గ్రామ పెద్దలు చందోజి, మండల మాజీ కోఆప్షన్ సభ్యుడు జహంగీర్ బాబా, నాగిళ్ల మల్లయ్య, కర్రోళ్ల రమేష్తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.




