Nagaram: అన్నరాయుని చెరువు కాలుష్య నివారణకై ఎమ్మెల్యే మల్లారెడ్డికి వినతి!

Nagaram: నాగారం అన్నరాయుని చెరువు కాలుష్యంపై ఎమ్మెల్యే మల్లారెడ్డిని కలిసిన మాజీ కౌన్సిలర్ అనిత సుధాకర్ రెడ్డి. హైడ్రా కమిషనర్‌కు వినతిపత్రం.

ASHOK, KAPRA
Published on: 12 Oct 2026 1:50 PM IST
Nagaram
X

Nagaram: అన్నరాయుని చెరువు కాలుష్య నివారణకై ఎమ్మెల్యే మల్లారెడ్డికి వినతి!

Nagaram: నాగారం డివిజన్ లోని నాగారం అన్నరాయుని చెరువులో కి ఎగువ ప్రాంతాల నుండి వచ్చు మురికి నీటితో పూర్తిగా చెరువు కాలుష్యం తో చుట్టుపక్కలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని సమస్యపై చెరువు పరిసర కాలనీల ప్రజలు స్థానిక మాజి కౌన్సిలర్ కొమిరెల్లి అనిత సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ని కలిసి వినతి పత్రం అందజేశారు.

తక్షణమే స్పందించిన మల్లారెడ్డి హైడ్రా కమిషనర్ కి వినతి పత్రంలో తక్షణమే అన్నరాయుని చెరువును ఇట్టి కాలుష్య భూతం నుండి కాపాడి ఎగువ ప్రాంతాల నుండి వచ్చే మురికి(డ్రైనేజి) నీటిని ప్రత్యేక ఫీడర్ కెనాల్ ద్వారా చెరువు లోనికి రాకుండా మళ్ళించి, చెరువులోని గుర్రపు డెక్కా & పుడికను తొలగించి, చెరువు పరిసరాలను అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సుందరీకరణ అభివృద్ధి చేయవలసిందిగా మనవి చేసుకున్నారు, అదే విధంగా ఎమ్మెల్యే ఆదేశానుసారం స్థానిక మాజీ కౌన్సిలర్ కోమిరెల్లి అనిత సుధాకర్ రెడ్డి కూడా ఇదే సమస్య పైన మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనర్ కి,హైడ్రా కమిషనర్ కి వినతి పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమం లో కోమిరెల్లి సుధాకర్ రెడ్డి, కమ్మంపాటి యాకయ్య, పంజలా నర్సింహా గౌడ్, పంగ చంద్రయ్య, అబ్బోజు రాంసుదాకర్, విశాల్ తదితరులు పాల్గొన్నారు.

ASHOK, KAPRA

ASHOK, KAPRA