Shabad: షాబాద్‌లో ఘనంగా బాలల దినోత్సవం.. విద్యార్థులకు మిఠాయిల పంపిణీ!
Shabad: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ హోప్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు.
Shabad: షాబాద్‌లో ఘనంగా బాలల దినోత్సవం.. విద్యార్థులకు మిఠాయిల పంపిణీ!
Shabad: షాబాద్ మండలంలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ హోప్ ఆధ్వర్యంలో షాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, హరిజనవాడ ప్రాథమిక పాఠశాల, పటేల్ గూడ ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, చిన్నారుల ముఖాల్లో చిరునవ్వులు నింపడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు లయన్స్ క్లబ్ సభ్యులు తెలిపారు.
పిల్లలే దేశ భవిష్యత్తు అని, ప్రతి ఒక్కరూ విద్యతో పాటు క్రమశిక్షణ, మంచి నడవడిక, సేవాభావం అలవర్చుకోవాలని సూచించారు. విద్యార్థులను ప్రోత్సహించడం, వారి ఆనందంలో భాగస్వాములు కావడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు, కొండ ప్రదీప్, మల్లికార్జున్ ,రాము, గోవర్ధన్ రెడ్డి, రాము తదితరులు పాల్గొన్నారు.




