Secunderabad: 22-A చట్టంపై రాష్ట్ర ప్రభుత్వంపై న్యాయపోరాటం చేస్తాం!

Secunderabad: సికింద్రాబాద్ కంటోన్మెంట్ మహేంద్రా హిల్స్ భూముల వివాదంపై 22-A చట్టాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై న్యాయపోరాటం చేస్తామని మాజీ వైస్ చైర్మన్.

Srikanth, Secunderabad
Published on: 26 Sept 2026 6:26 PM IST
Secunderabad
X

Secunderabad: 22-A చట్టంపై రాష్ట్ర ప్రభుత్వంపై న్యాయపోరాటం చేస్తాం!

Secunderabad: 22A మీద రాష్ట్ర ప్రభుత్వం పై న్యాయపోరాటం చేస్తామని కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ చైర్మన్ రామకృష్ణ హెచ్చరించారు..కెసిఆర్ సర్కార్ ధరణి పోర్టల్ తో వేల కోట్ల విలువైన భూములను కొల్లగొడితే అదే మాదిరిగా రేవంత్ రెడ్డి భూ మాత పేరుతో భూములను కొల్లగొడుతున్నారని రామకృష్ణ మండిపడ్డారు..22A చట్టం అన్యాయమైన జీఓ అని తాత ముత్తాతల నుండి వస్తున్న ప్రయివేటు ఆస్తులను ప్రభుత్వ భూమిగా ఎలా పరిగణిస్తారని రామకృష్ణ ప్రశ్నించారు.

కంటోన్మెంట్ పరిధిలో ఉన్న మహేంద్రాహిల్స్ భూముల ఎలా 22A కిందకు వస్తాయని,అక్కడ ఇప్పటికే పదివేల కుటుంబాలు నివాసం ఉంటున్నాయని ఆయన పేర్కొన్నారు..కంటోన్మెంట్ మహేంద్రహిల్స్ భూములపై గత కెసిఆర్ ప్రభుత్వం లోనే సుప్రీంకోర్టు ప్రయివేటు భూములని తేల్చిందని గుర్తుచేస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ పై కంటెమెంట్ ఆఫ్ కోర్టు కింద కోర్టుకు వెళ్లి న్యాయ పోరాటం చేస్తామని రామకృష్ణ స్పష్టం చేశారు.

Srikanth, Secunderabad

Srikanth, Secunderabad