LB Nagar: ఎల్‌బీనగర్‌లో ఘనంగా గణనాథుడి నిమజ్జనం: యువత జోష్
LB Nagar: ఎల్‌బీనగర్ పాత మారుతీనగర్‌లో ఛత్రపతి శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ నిమజ్జనంలో స్థానిక ప్రజాప్రతినిధులు, యువత పాల్గొన్నారు.
LB Nagar: ఎల్‌బీనగర్‌లో ఘనంగా గణనాథుడి నిమజ్జనం: యువత జోష్
ఎల్‌బీనగర్: పాత మారుతీనగర్ రోడ్ నంబర్–2లో ఛత్రపతి శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి నిమజ్జన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నిమజ్జన వేడుకల్లో యువత ఉత్సాహంగా పాల్గొని గణనాథుడికి భక్తిశ్రద్ధలతో వీడ్కోలు పలికారు.
ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ పవన్‌కుమార్, బీజేపీ కొత్తపేట డివిజన్ వైస్ ప్రెసిడెంట్ తోట మహేంద్ర యాదవ్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు.
యువత భారీగా పాల్గొనడంతో పాత మారుతీనగర్ ప్రాంతంలో సందడి నెలకొంది. భక్తులు, యువత గణేష్ నామస్మరణలతో ఉత్సాహంగా నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బోగా భరత్‌కుమార్, పుటికలపురి చందు, బోగా వినోద్‌కుమార్, వికాస్, నాగార్జున, యకయ్య, శంకర్, శ్రీకాంత్, నాగేంద్ర, విక్రమ్, పృథ్వీ, వెంకటేష్, విజయ్, చిరంజీవి, వివేక్, శెట్టి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.




