LB Nagar: ఎల్బీనగర్ నూతన ఎస్‌హెచ్‌ఓగా బి. వెంకటేశం బాధ్యతల స్వీకరణ!

LB Nagar: ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ నూతన స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా (ఎస్‌హెచ్‌ఓ) బి. వెంకటేశం శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. శాంతిభద్రతల రక్షణే ధ్యేయమని స్పష్టం చేశారు.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 16 Oct 2026 6:39 PM IST
LB Nagar
X

LB Nagar: ఎల్బీనగర్ నూతన ఎస్‌హెచ్‌ఓగా బి. వెంకటేశం బాధ్యతల స్వీకరణ!

ఎల్బీనగర్: ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ నూతన స్టేషన్ హౌస్ ఆఫీసర్‌ (ఎస్‌హెచ్‌ఓ)గా బి. వెంకటేశం శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వెంకటేశం మాట్లాడుతూ.. ఎల్బీనగర్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తానని తెలిపారు.

ప్రజలకు అందుబాటులో ఉంటూ పోలీస్ శాఖ సేవలను అందిస్తానని పేర్కొన్నారు. కాగా, ఇంతకుముందు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన వినోద్ కుమార్ గోపాలపురం ట్రాఫిక్ ఎస్‌హెచ్‌ఓగా బదిలీ అయ్యారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR