LB Nagar: నవంబర్ 1న ఎల్బీనగర్‌లో పద్మశాలి దసరా మేళా

LB Nagar: నవంబర్ 1న వనస్థలిపురం జింకల పార్కులో పద్మశాలి దసరా మేళా. రాష్ట్రవ్యాప్తంగా పద్మశాలీయులు తరలిరావాలని పున్న గణేష్ నేత పిలుపు.

B SHETTAIAH GOUD, LB NAGAR
Updated on: 31 Oct 2026 7:19 PM IST
LB Nagar
X

LB Nagar: నవంబర్ 1న ఎల్బీనగర్‌లో పద్మశాలి దసరా మేళా

ఎల్బీనగర్: పద్మశాలీల ఐక్యత, ఆత్మీయతకు ప్రతీకగా నిర్వహించే పద్మశాలి దసరా మేళాను విజయవంతం చేయాలని ఎల్బీనగర్ పద్మశాలి సంఘం అధ్యక్షుడు వున్న గణేష్ నేత పిలుపునిచ్చారు. వనస్థలిపురంలోని ఆటోనగర్ జింకల పార్కులో నవంబర్ 1న నిర్వహించనున్న దసరా మేళా ఏర్పాట్లపై ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పద్మశాలీయులందరూ కుటుంబ సమేతంగా ఈ వేడుకల్లో పాల్గొనాలని కోరారు. ఏటా నిర్వహించే పద్మశాలి దసరా మేళాకు విశేష ఆదరణ లభిస్తోందని, కులబాంధవులందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

నవంబర్ 1న ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వేడుకలు కొనసాగుతాయని వెల్లడించారు. అన్ని రాజకీయ పార్టీలకు చెందిన పద్మశాలి నాయకులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా రాజకీయ నాయకుల ప్రసంగాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలు, బతుకమ్మ సంబరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పద్మశాలి సంఘాలు, జిల్లా, మండల సంఘాలు, చేనేత సహకార సంఘాల ప్రతినిధులకు ఆహ్వానాలు పంపినట్లు వివరించారు.

జింకల పార్కులోని ఆహ్లాదకరమైన వాతావరణంలో కుటుంబ సభ్యులు, పిల్లలతో కలిసి రోజంతా ఆనందంగా గడిపేలా కార్యక్రమాలను రూపొందించినట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పద్మశాలి కులబాంధవులు, సంఘాల అధ్యక్షులు, జిల్లా, మండల అధ్యక్షులు, కమిటీ సభ్యులు, మహిళా విభాగం ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై దసరా మేళాను విజయవంతం చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR