LB Nagar: చైతన్య వికాస్ మహిళా సంఘం 20వ వార్షికోత్సవం
LB Nagar: వనస్థలిపురంలో చైతన్య వికాస్ మహిళా సహకార సంఘం 20వ వార్షికోత్సవం. మహిళల ఆర్థిక స్వావలంబనకు సహకార సంఘాలు ఎంతో దోహదం: ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి.
LB Nagar: చైతన్య వికాస్ మహిళా సంఘం 20వ వార్షికోత్సవం
ఎల్బీనగర్: మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించి, కుటుంబాల అభ్యున్నతితో పాటు సమాజ అభివృద్ధిలోనూ భాగస్వాములు కావడం అభినందనీయమని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. వనస్థలిపురం డివిజన్ పరిధిలోని చింతలకుంట చెక్‌పోస్ట్ సమీపంలో ఆర్టీసీ కాలనీ కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించిన చైతన్య వికాస్ మహిళా సహకార పొదుపు పరపతి సంఘం లిమిటెడ్ 20వ వార్షికోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళల్లో పొదుపు అలవాట్లను పెంపొందించడం, ఆర్థిక స్వావలంబన సాధించడం, పరస్పర సహకారాన్ని ప్రోత్సహించడం వంటి లక్ష్యాలతో మహిళా సహకార సంఘాలు చేస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ఇటువంటి సంఘాలు కీలక వేదికలుగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.
చైతన్య వికాస్ మహిళా సహకార సంఘం మరిన్ని విజయాలు సాధిస్తూ, మహిళల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళా సంఘాల ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.




