LB Nagar: ఎల్‌బీనగర్‌లో అర్ధరాత్రి పోలీసుల మెరుపు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్!

LB Nagar: ఎల్‌బీనగర్‌లో పోలీసుల మెరుపు తనిఖీలు. 43 వాహనాలు, మద్యం స్వాధీనం. అనుమానితులు, రౌడీషీటర్ గుర్తింపు. డీసీపీ అనురాధ వెల్లడి.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 6 Nov 2026 7:27 AM IST
LB Nagar
X

LB Nagar: ఎల్‌బీనగర్‌లో అర్ధరాత్రి పోలీసుల మెరుపు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్!

LB Nagar: మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో అర్ధరాత్రి పోలీసులు మెరుపు తనిఖీలు నిర్వహించారు. ఎల్‌బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాంచారమ్మ కాలనీ, ఏకలవ్య కాలనీల్లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేపట్టారు.

పోలీస్ కమిషనర్ సుమతి, ఐపీఎస్ ఆదేశాల మేరకు అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు తనిఖీలు కొనసాగాయి. ఎల్బీనగర్ జోన్ డీసీపీ అనురాధ మాట్లాడుతూ కాలనీల్లో బయటి వ్యక్తుల కదలికలు, అనుమానాస్పద వ్యక్తుల వివరాలను పోలీసులు పరిశీలించారు. ప్రజలకు భద్రత కల్పించడంతో పాటు నేరాల నియంత్రణే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టారు.

తనిఖీల్లో గుర్తించిన అంశాలు:

తనిఖీల్లో మొత్తం 204 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

సుమారు 105 మంది సిబ్బందితో క్షేత్రస్థాయిలో తనిఖీలు.

ఇద్దరు అనుమానితుల గుర్తింపు.

ఒక రౌడీషీటర్‌ను గుర్తించిన పోలీసులు.

సరైన పత్రాలు లేని 43 వాహనాలు స్వాధీనం.

10 లీటర్ల మద్యం స్వాధీనం.

కాలనీల్లో అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా నిరంతర నిఘా కొనసాగిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని స్థానికులకు సూచించారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR