LB Nagar: బి.ఎన్.రెడ్డి నగర్ గణేష్ మండపాన్ని సందర్శించిన కేటీఆర్!
LB Nagar: ఎల్బీనగర్ బి.ఎన్.రెడ్డి నగర్ కాలనీలో శ్రీ విజ్ఞాన్ జ్యోతి అసోసియేషన్ వినాయక మండపాన్ని సందర్శించిన కేటీఆర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు
LB Nagar: బి.ఎన్.రెడ్డి నగర్ గణేష్ మండపాన్ని సందర్శించిన కేటీఆర్!
LB Nagar: బి.ఎన్.రెడ్డి నగర్ కాలనీ ఆడిటోరియం గ్రౌండ్‌లో శ్రీ విజ్ఞాన్ జ్యోతి అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సందర్శించారు.
ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డితో కలిసి కేటీఆర్ వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేటీఆర్ రాకతో మండపం వద్ద బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానికుల్లో సందడి నెలకొంది.
ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, రాజేంద్రనగర్ బీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి, బి.ఎన్.రెడ్డి నగర్ డివిజన్ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




