LB Nagar: ఎల్‌బీనగర్‌లో జనవాణి: సమస్యల పరిష్కారమే లక్ష్యం
LB Nagar: ఎల్బీనగర్ వనస్థలిపురం రైతుబజార్‌లో నిర్వహించిన ‘జనవాణి’ కార్యక్రమంలో ప్రజలు, రైతుల నుంచి సమస్యలను స్వీకరించి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
LB Nagar: ఎల్‌బీనగర్‌లో జనవాణి: సమస్యల పరిష్కారమే లక్ష్యం
ఎల్‌బీనగర్: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేయడమే లక్ష్యంగా ‘జనవాణి’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు నిర్వాహకులు శివ నాగేశ్వర్ రావు తెలిపారు. తెలంగాణలో జనవాణి కార్యక్రమాన్ని తొలిసారిగా ఎల్‌బీనగర్ నియోజకవర్గంలో నిర్వహించాలన్న సంకల్పంతో వనస్థలిపురం రైతుబజార్ వద్ద ప్రజలతో కలిసి కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకుని నమోదు చేశారు. జనవాణి నంబర్ ద్వారా సంబంధిత అధికారులకు ఫిర్యాదులు పంపడంతో పాటు.. అధికారులను కలిసి అర్జీలు సమర్పించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.
రైతుబజార్‌లో మరుగుదొడ్లు లేకపోవడం, ఈ-పాస్ విషయంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ప్రధానంగా తమ దృష్టికి వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రజల నుంచి కార్యక్రమానికి మంచి స్పందన లభించిందని తెలిపారు.
జనవాణి కార్యక్రమాన్ని తెలంగాణవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి.. ప్రజా సమస్యలను గుర్తించి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తామని నిర్వాహకులు వెల్లడించారు.




