LB Nagar: శ్రీ అయ్యప్ప మహా పడిపూజలో పాల్గొన్న కళ్లెం నవజీవన్ రెడ్డి
LB Nagar: ఎల్బీనగర్ హైకోర్టు కాలనీ డివిజన్ సాయినగర్ కాలనీలో శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ; ప్రత్యేక పూజలు చేసిన మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి.
LB Nagar: శ్రీ అయ్యప్ప మహా పడిపూజలో పాల్గొన్న కళ్లెం నవజీవన్ రెడ్డి
ఎల్బీనగర్: హైకోర్టు కాలనీ డివిజన్ పరిధిలోని సాయినగర్ కాలనీలో నిర్వహించిన శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమంలో హయత్‌నగర్ మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
అయ్యప్ప స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. భక్తిభావంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి భక్తులు పాల్గొన్నారు.




