LB Nagar: ఫోన్ అప్డేట్ నోటిఫికేషన్ తెరిస్తే.. బ్యాంకు ఖాతా ఖాళీ!
LB Nagar: ఎల్బీనగర్ పరిధిలోని సరూర్నగర్ గౌతమ్నగర్కు చెందిన ఓ ఉపాధ్యాయురాలు ఫోన్ అప్డేట్ నోటిఫికేషన్ తెరవడంతో సైబర్ మోసగాళ్లు ఆమె ఖాతా నుంచి రూ.1.73 లక్షలు కాజేశారు.
LB Nagar: ఫోన్ అప్డేట్ నోటిఫికేషన్ తెరిస్తే.. బ్యాంకు ఖాతా ఖాళీ!
ఎల్బీనగర్: ఫోన్ అప్డేట్ చేసుకోవాలంటూ వచ్చిన నోటిఫికేషన్ ఓ ఉపాధ్యాయురాలిని సైబర్ మోసగాళ్ల బారిన పడేసింది. అప్డేట్ చేసిన కొద్దిసేపటికే ఫోన్ పనిచేయకపోగా.. మరుసటి రోజు ఆమె బ్యాంకు ఖాతా నుంచి మూడు విడతల్లో రూ.1.73 లక్షలు మాయమయ్యాయి.
సరూర్నగర్ సమీపంలోని గౌతమ్నగర్కు చెందిన 40 ఏళ్ల ఉపాధ్యాయురాలికి ఈ నెల 26న రిజిస్టర్ మొబైల్ నంబరుకు ఫోన్ అప్డేట్ చేసుకోవాలంటూ నోటిఫికేషన్ వచ్చింది. దాన్ని తెరిచి అప్డేట్ చేయడంతో సుమారు గంటపాటు ఫోన్ పనిచేయలేదు. మరుసటి రోజు ఖాతా నుంచి మూడు విడతల్లో రూ.1.73 లక్షలు ఆమె అనుమతి లేకుండా మరో ఖాతాకు బదిలీ అయినట్లు సందేశాలు వచ్చాయి. దీంతో బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
జాగ్రత్త: గుర్తుతెలియని లింకులు, ఫోన్ అప్డేట్ పేరుతో వచ్చే అనుమానాస్పద నోటిఫికేషన్లను తెరవొద్దని పోలీసులు సూచిస్తున్నారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలనీ సూచించిన మల్కాజిగిరి సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు.




