LB Nagar: కొత్తపేటలో అంతుచిక్కని మంటలు.. కళ్ల ముందే కాలి బూడిదైన కారు!
LB Nagar: ఎల్బీనగర్ సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపేటలో నడుస్తున్న కారులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు; డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.
LB Nagar: కొత్తపేటలో అంతుచిక్కని మంటలు.. కళ్ల ముందే కాలి బూడిదైన కారు!
LB Nagar: సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కారు అగ్నికి ఆహుతైన ఘటన కలకలం రేపింది. కొత్తపేటలోని వీఎం హోం మెట్రో స్టేషన్ సమీపంలో బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
ఎల్బీనగర్ నుంచి దిల్‌సుఖ్‌నగర్ వైపు వెళ్తున్న కారులో ఒక్కసారిగా ఇంజిన్ భాగంలో మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన కారు డ్రైవర్ వెంటనే వాహనం నుంచి బయటకు వచ్చాడు. స్థానికుల సహాయంతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే మంటలు వేగంగా వ్యాపించాయి.
దీంతో కారులోని సీట్లు, టైర్లు సహా వాహనం తీవ్రంగా దగ్ధమైంది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.




