LB Nagar: అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏసీపీ కృష్ణయ్యపై వేటు!

LB Nagar: అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్యను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి విధుల్లో చేరిన వెంటనే వేటు పడింది.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 5 Oct 2026 6:55 PM IST
LB Nagar
X

LB Nagar: అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏసీపీ కృష్ణయ్యపై వేటు!

ఎల్బీనగర్: పలు అవినీతి, అక్రమ ఆరోపణల నేపథ్యంలో ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్యను ఉన్నతాధికారులు సస్పెండ్ చేసినట్లు సమాచారం. కొంతకాలంగా కృష్ణయ్యపై అవినీతి, అక్రమాలకు సంబంధించిన ఆరోపణలు ఉన్నట్లు సమాచారం. గతంలో సస్పెన్షన్‌కు సంబంధించిన చర్యలు చేపట్టే సమయంలో ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందినట్లు తెలుస్తోంది.

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అనంతరం తిరిగి విధుల్లో చేరిన కృష్ణయ్యను తాజాగా సస్పెండ్ చేసినట్లు సమాచారం. కృష్ణయ్యపై వచ్చిన ఆరోపణలు, సస్పెన్షన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక ఉత్తర్వులు వెలువడిన తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR