Boduppal: బతుకమ్మ వేడుకల్లో డీసీసీ అధ్యక్షుడి సతీమణి లక్ష్మీ యాదవ్‌ సందడి

Boduppal: బోడుప్పల్‌ చెంగిచెర్ల ప్రశాంతనగర్‌లో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. డీసీసీ అధ్యక్షుడి సతీమణి లక్ష్మీ యాదవ్‌ పాల్గొని సందడి చేశారు.

KARUNAKAR, UPPAL
Updated on: 10 Oct 2026 11:34 PM IST
Boduppal
X

Boduppal: బతుకమ్మ వేడుకల్లో డీసీసీ అధ్యక్షుడి సతీమణి లక్ష్మీ యాదవ్‌ సందడి

బోడుప్పల్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్‌ సర్కిల్‌ పరిధిలోని చెంగిచెర్ల డివిజన్‌ ప్రశాంత్‌నగర్‌ కాలనీలో ఘనంగా జరిగాయి. ఇంగిలిపువ్వు బతుకమ్మ సందర్భంగా మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయ పాటలు పాడుతూ సంబరాలు జరుపుకున్నారు.

బతుకమ్మ పాటలతో కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ వేడుకల్లో డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్‌ యాదవ్‌ సతీమణి, మాజీ సర్పంచ్‌ తోటకూర లక్ష్మీ యాదవ్‌, వారి కోడళ్లు, బోడుప్పల్‌ మాజీ మేయర్‌ తోటకూర అజయ్‌ యాదవ్‌ సతీమణి స్పందన యాదవ్‌, శ్రీ పవిత్రతో పాటు కాలనీ మహిళలు, స్థానికులు పాల్గొన్నారు. మహిళలంతా బతుకమ్మల చుట్టూ చేరి సంప్రదాయ పాటలు పాడుతూ, ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తోటకూర లక్ష్మీ యాదవ్‌ మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ఐక్యతకు ప్రతీక అని తెలిపారు. పూలతో ప్రకృతిని ఆరాధిస్తూ సంప్రదాయబద్ధంగా జరుపుకునే ఈ పండుగ మన సంస్కృతికి ప్రత్యేక గుర్తింపునిస్తుందని పేర్కొన్నారు. తరతరాలుగా వస్తున్న బతుకమ్మ సంప్రదాయాలను కాపాడుతూ, భావితరాలకు అందించాలని అన్నారు. మహిళలందరూ కలిసికట్టుగా వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL