Kushaiguda: కుషాయిగూడలో జిహెచ్ఎంసి పారిశుద్ధ్య కార్మికులకు చీరల పంపిణీ
Kushaiguda: కుషాయిగూడలో జిహెచ్ఎంసి పారిశుద్ధ్య కార్మికులను సన్మానించి చీరలు పంపిణీ చేసిన సింగిరెడ్డి వికాస్ రెడ్డి. నగర పారిశుద్ధ్య కార్మికుల సేవలను కొనియాడారు.
Kushaiguda: కుషాయిగూడలో జిహెచ్ఎంసి పారిశుద్ధ్య కార్మికులకు చీరల పంపిణీ
కుషాయిగూడ: కుషాయిగూడలో దసరా పండుగ సందర్భంగా జిహెచ్ఎంసి పారిశుద్ధ్య కార్మికులను సన్మానించి, చీరల ను సింగిరెడ్డి వికాస్ రెడ్డి పంపిణీ చేశారు
ఈ సందర్భంగా సింగిరెడ్డి వికాస్ రెడ్డి మాట్లాడుతూ..మన హైదరాబాద్ నగరంలో దాదాపు 18 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు ప్రతిరోజూ తెల్లవారుజామునే లేచి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ఎంతో కష్టపడుతున్నారు.
ప్రజల ఆరోగ్యం కోసం, మన నగరం పరిశుభ్రంగా ఉండటం కోసం వారు చేస్తున్న సేవలు ఎంతో గొప్పవి. వారి కష్టాన్ని గుర్తించి, వారిని గౌరవించడం మనందరి బాధ్యత.
ఈ దసరా పండుగ సందర్భంగా వారికి సన్మానం చేసి, చీరలను పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉంది. పారిశుద్ధ్య కార్మికులందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.”




