Kushaiguda: కుషాయిగూడలో రోడ్డు ప్రమాదం: చెట్టును ఢీకొని యువకుడి మృతి!
Kushaiguda: కుషాయిగూడ పరిధిలోని నాగార్జున నగర్‌లో ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ప్రమాదంలో బోడుప్పల్‌కు చెందిన ప్రైవేట్ ఉద్యోగి కన్నారపు శ్రవణ్ (29) మృతి చెందాడు.
Kushaiguda: కుషాయిగూడలో రోడ్డు ప్రమాదం: చెట్టును ఢీకొని యువకుడి మృతి!
కుషాయిగూడ: కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగార్జున నగర్, కుషాయిగూడ ప్రాంతంలో 04.10.2026 తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. మృతుడు కన్నారపు శ్రవణ్, వయస్సు 29 సంవత్సరాలు, వృత్తి: ప్రైవేట్ ఉద్యోగి, R/o బోడుప్పల్. 03.10.2026న విధులకు వెళ్లిన శ్రవణ్, విధులు ముగించుకుని తన సహోద్యోగి ఇంటికి నాగార్జున నగర్ ప్రాంతానికి వెళ్లాడు.
అనంతరం ఇంటికి తిరిగి వస్తుండగా, 04.10.2026 సుమారు 02:35 గంటల సమయంలో నాగార్జున నగర్, కుషాయిగూడ సమీపంలో తన ద్విచక్ర వాహనం Activa నం. TS27U4867పై వెళ్తూ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టాడు.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రవణ్‌ను స్థానికులు శ్రీకర హాస్పిటల్, ఈసీఐఎల్‌కు తరలించగా, వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.




