Kushaiguda: కుషాయిగూడలో ఇండ్ల మధ్య పిడుగుపాటు
Kushaiguda: కుషాయిగూడ డివిజన్ శివ సాయి నగర్‌లో తాటి చెట్టుపై పిడుగు పడింది. మంటలు చెలరేగగా, ప్రాణనష్టం తప్పడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
Kushaiguda: కుషాయిగూడలో ఇండ్ల మధ్య పిడుగుపాటు
కుషాయిగూడ: కాప్రా సర్కిల్ కుషాయిగూడ డివిజన్ పరిధిలోని శివ సాయి నగర్ లో ఉరుములు మెరుపులతో ఒక్కసారిగా భారీ శబ్దం చేస్తూ ఇండ్ల మధ్యన ఉన్న తాటి చెట్టు పై పిడుగు పడింది. ఒకసారి గా మంటలు చెలరేగాయి. చుట్టుపక్కల కుటుంబాలు భయాందోళనకు లోనయ్యారు.
ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు




