Kushaiguda: కుషాయిగూడలో వైభవంగా గణపతి మహా హారతి!

Kushaiguda: కుషాయిగూడ టీజీఐఐసీ కాలనీలో యువసేన మహా గణపతికి 5000 మంది విద్యార్థినులతో మహా హారతి; హాజరైన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి

ASHOK, KAPRA
Published on: 24 Sept 2026 7:33 AM IST
Kushaiguda
X

Kushaiguda: కుషాయిగూడలో వైభవంగా గణపతి మహా హారతి!

Kushaiguda: కుషాయిగూడ టీజీఐఐసీ కాలనీ మైదానంలో యువసేన ఆధ్వర్యంలో నెలకొల్పిన మహా గణపతికి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి సమక్షంలో 5000 మంది వసుందర కళాశాల విద్యార్థినులతో వినాయకుడికి మహా హారతి కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా గణపతి మండపం పరిసరాలు గణపతి భజన, భక్తి గీతాలతో మారుమ్రోగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హాజరై విద్యార్థినులతో కలిసి మహా ఘననాథుడికి అఖండ హారతి ఇచ్చారు. అనంతరం విద్యార్థినులతో కలసి చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి.

ఒకే సమయంలో వసుందర కళాశాల విద్యార్థినులు ప్రమిదలతో గణపతికి మహా హారతి దృశ్యం కన్నుల పండువగా కనిపించింది. ఈ దృశ్యాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ యువసేన ఆధ్వర్యంలో గత 28 సంవత్సరాలుగా వినాయక చవితి సందర్భంగా ఘననాథుడిని నెలకొల్పి భక్తి శ్రద్ధలతో 13 రోజులు పూజలు నిర్వహించి నిమర్జనం చివరి రోజు వేలాది మంది కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి, అనంతరం బాజా భజంత్రీల నడుమ నిమర్జనం చేయడం హర్షణీయమన్నారు.

తెలిపారు. ఈ ఏడాది వినూత్నంగా ఉండాలని, కళాశాల విద్యార్థినిలు(జెంజీలు)లలో భక్తి భావం పెంపొందించేందుకు ఈ మహా హారతి కార్యక్రమం దోహదపడుతుందన్నారు. విద్యార్థినులతో కలసి మహా హారతి కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందని, ఈ కార్యక్రమం అందరినీ ఎంతగానో ఆకట్టుకుందని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు కాసం మహిపాల్ రెడ్డి కుషాయిగూడ సిఐ ఎస్ఐలు పోలీస్ సిబ్బంది తో పాటు పలువురు ప్రముఖులు, నాయకులు, కార్యకర్తలు, కుషాయిగూడ పరిసర ప్రాంత ప్రజలు పాల్గొన్నారు.

ASHOK, KAPRA

ASHOK, KAPRA