Kukatpally: ఐడీఎల్‌ చెరువులో నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన!

Kukatpally: కూకట్‌పల్లి ఐడీఎల్‌ చెరువులో విగ్రహాల నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన సైబరాబాద్‌ సీపీ; భద్రతా చర్యలను పటిష్టం చేయాలని అధికారులకు ఆదేశాలు.

Maruthisagar, Kukatpally
Published on: 24 Sept 2026 8:44 AM IST
Kukatpally
X

Kukatpally: ఐడీఎల్‌ చెరువులో నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన!

Kukatpally: ఐడీఎల్‌ చెరువులో వినాయక విగ్రహాల నిమజ్జనానికి అధికారులు చేపట్టిన ఏర్పాట్లను సైబరాబాద్‌ సీపీ పరిశీలించారు. చెరువులో నీటి మట్టం, బేబీ పాండ్‌, వాచ్‌ టవర్‌తో పాటు భక్తుల భద్రతకు చేపట్టిన ఇతర ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా చర్యలను పటిష్టం చేయాలని అధికారులకు సూచించారు.

భక్తుల రద్దీ నియంత్రణ, ట్రాఫిక్‌ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, సజావుగా జరిగేలా సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కూకట్‌పల్లి డీసీపీ, క్రైమ్స్‌ అండ్‌ ఈఓడబ్ల్యూ డీసీపీ, కూకట్‌పల్లి అదనపు డీసీపీ, బాలానగర్‌ ఏసీపీ, ఈఓడబ్ల్యూ ఏసీపీలు, ట్రాఫిక్‌ ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Maruthisagar, Kukatpally

Maruthisagar, Kukatpally