Kukatpally: కూకట్‌పల్లిలో వైభవంగా సద్దుల బతుకమ్మ ముఖ్యఅతిథిగా హాజరైన బండి రమేష్

Kukatpally: కూకట్‌పల్లి గాయత్రీ నగర్ డివిజన్‌లో నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో కాంగ్రెస్ ఇంచార్జ్, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ పాల్గొన్నారు.

RAJESH,	WEST ZONE
Published on: 19 Oct 2026 2:40 PM IST
Kukatpally
X

Kukatpally: కూకట్‌పల్లిలో వైభవంగా సద్దుల బతుకమ్మ ముఖ్యఅతిథిగా హాజరైన బండి రమేష్

కూకట్పల్లి: కూకట్ పల్లి నియోజకవర్గ గాయత్రీ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీ వివేకానంద నగర్ లో వేముల సత్యం, స్రవంతి ఆధ్వర్యంలో నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకలకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని దీనిలో భాగంగా ఇక్కడ నిర్వహించిన కార్యక్రమాన్ని ఆయన అభినందించారు.

సద్దుల బతుకమ్మ సందర్భంగా మహిళలందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని వెల్లడించారు. రేపు ఆయుధపూజ, ఎల్లుండి శమీ పూజ చేసి అమ్మవారిని పూజిస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం తో పాటు ప్రజలందరూ బాగుండాలని పంటలు వర్షాలు సుభిక్షంగా పండాలని ఆయన కోరుకున్నట్లు తెలిపారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE